శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2015 (12:46 IST)

తిరుమలలో వైభవంగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం అంగరంగవైభవంగా జరిగింది. పుష్కరణిలో జరిగే ఈ మహోత్సవానికి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి చక్రస్నాన సమయంలో మూడు మునకలు వేసి తరించిపోయారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు.. తొమ్మిదిరోజుల పాటు ఈ స్నానంతో సంపూర్ణం చేయడం అనావాయితీ. ఒకవైపు వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం చాలా కన్నుల పండువలా జరిగింద.ి 
 
చక్రస్నానం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.