శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:45 IST)

తిరుమలలో మార్చి 1 నుంచి తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

తిరుమలలో మార్చి 1 నుంచి ఐదు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తెప్పోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో శ్రీవారు తెప్పలపై ఊరేగుతారు.  ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు జరిగే ఈ తెప్పోత్సవాలు పాల్గుణమాసంలో శుద్ద ఏకాదశినాడు ప్రారంభమైన పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి. తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది. 
 
1468లో పుష్కరిణి మధ్యలో సాళువ నరసింహరాయలు 'నీరాళిమండపాన్ని' నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దాడు. మొదటిరోజు సాయంత్రం స్వామివారు శ్రీ సీత,లక్ష్మణ,ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో పుష్కరిణిలో తెప్ప పై ఊరేగుతూ భక్తులకు కను విందు చేస్తారు. రెండవరోజు ద్వాదశినాడు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ అవతారంలో పురవీధులలో ప్రదక్షణంగా ఊరేగుతూ వచ్చి మరలా పుష్కరిణిలో తెప్ప పై మూడుసార్లు విహరిస్తారు. 
 
మూడవరోజు త్రయోదశినాడు శ్రీ భూసమేతంగా మలయస్సస్వామివారు తిరుచ్చినెక్కి సర్వాలంకార భూషితుడై పురవీధులలో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్ప పై ఆశీనుడై మూడుసార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. ఇదేవిధంగా మలయప్ప నాల్గవరోజు ఐదు ప్రదక్షణలు చివరి రోజు తెప్ప పై పుష్కరిణిలో ఏడుమార్లు విహరిస్తారు. 
 
ఆర్జిత సేవలలో కొన్నింటిని రద్దు చేస్తోంది. తొలి రెండురోజులు తెప్పోత్సవం నేపథ్యంలో వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. చివరి మూడురోజులు అర్జితసేవలైన బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.