గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (08:31 IST)

చేతి నిండా గాజులు.. ఒంటి నిండా చీరెలు.. విదేశీ వనితలు

నుదుటన బొట్టు.. చేతి నిండా గాజులు.. ఒంటిని పూర్తిగా కప్పేస్తూ చీరెలు కుట్టుకుని మహిళలు .. సాంప్రదాయబద్ధంగా పూజలు.. శ్రీకాళహస్తిలో మహిళలు ఇలా దర్శనమిచ్చారు.  ఇవి భారతీయ మహిళలకు ఉండే సహజలక్షణమే కదా. ఆలయానికి వస్తే ఇలాగే కదా వస్తారు అనుకుంటాం. కానీ అలా వచ్చింది. ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారా.. భారతీయ మహిళలు కాదు. విదేశీ వనితలు.. 
 
భారతీయ కట్టుబొట్టు, చీరె, గాజులను మరచి మన మహిళలు విదేశీ సంస్కృతి వైపు పరుగులు పెడుతుంటే విదేశీ వనితలు ఇలా మన సాంప్రదాయాలలో కనిపిస్తే ఆశ్చర్యం కలగక మానదు కదూ.. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికా దేశానికి చెందిన కొందరు భక్తులు భారతదేశ పర్యటనకు వచ్చారు. దేశాన్ని చుడుతున్న క్రమంలో వారు నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని పెంచలకోనలోని లక్ష్మినరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
 
అక్కడ నుంచి కరుణామయ ఆశ్రమాన్ని సందర్శించారు. విదేశీ వనితలు వస్తూ వస్తూ రాపూరులో గాజులు చూసి మోజు పడ్డారు. మట్టితో ఇలాంటి గాజలు కూడా తయారు చేస్తారా.. అని ఆశ్చర్య పడిపోయారు. రంగు రంగుల గాజులను కొనుగోలు చేసి చేతి నిండా తొడుకుని మురిసిపోయారు. అక్కడ నుంచి వస్తూ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి చీరెలను ఒంటి నిండా చుట్టుకుని భారతీయ అనుభూతిని ఆస్వాదించారు. 
 
కట్టుబొట్టుతో ఉన్న ఆ మహిళల భారతీయ మహిళలను తలపించారు. ఒక రంగు మినహా వారు అచ్చుగుద్దినట్లు మన ఆడపడుచుల్లానే కనిపించారు. అంతటితో ఆగని ఆ అమెరికన్లు నేరుగా శ్రీకాళహస్తి చేరుకుని కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ప్రత్యేక పూజలు చేసుకుని ‘శివయ్యా.. మమ్మల్ని కరుణించవయ్యా..’ అంటూ వేడుకున్నారు.