బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ivr
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2015 (18:02 IST)

ఏ గుణాల వల్ల శ్రీరాముడు మానవ ధర్మానికి ప్రతీకగా నిలిచాడు...?

ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా... ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. మానవ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక. లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక అయితే హనుమంతుడు భక్తికి ప్రతీక.
 
రామునిలో ఉన్న 16 గుణాలు ఏవంటే...
1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11.ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15.ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.