శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (06:33 IST)

తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమలలో రద్దీ చాలా సాధారణంగా ఉంది. దాదాపుగా నేరుగానే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థతి ఉంది. గురువారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ 34,592 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రానికి సర్వ దర్శనం, నడకదారిన వచ్చే భక్తులు రెండేసి కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారు కూడా గురువారం రాత్రి ఆలయం మూత పడే లోపు దర్శనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. 
 
శుక్రవారం మధ్యహ్నం పైన సాయంత్రానికి భక్తుల రద్దీ కాస్త పెరగవచ్చు. వారాంతం కావడంతో చెన్నయ్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెరిగే అవకాశం ఉంది. బస చేయడానికి గదలు కూడా ఖాళీగానే ఉన్నాయి.