మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (08:23 IST)

శ్రీవారి ఆనంద నిలయంపై రావి మొలక... ఎప్పుడు?

పేరు ప్రతిష్టలు సంపాదించిన తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీవారి ఆలయం పట్ల అశ్రద్ధతో ఉందనే విషయం మరోమారు స్పష్టమయ్యింది. ఆలయంపై రావి మొక్కలు మొలుస్తున్నాయి. అప్పుడప్పుడు ఆనంద నిలయం పై భాగాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రావి మొక్కలు బంగారు తొడుగులను కూడా చీల్చుకుని వస్తున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై రావిమొలక వచ్చింది!
 
ఆలయ గోపురాలపై రావి మొక్కలు మొలుస్తుంటాయి. అందుకు తిరుమల ఆలయం ప్రత్యేకం ఏమి కాదు. అయితే ఆలయగోపురంపై బంగారు పూత పూసిన రేకులు బిగించి ఉంటారు. అయితే వాటికి పూత పూయడం.. శుభ్రపరచడం జరుగుతుంటుంది. అయితే ఆనందనిలయం ఆగ్నేయదిశలో ఓ రావి మొక్క పెరుగుతోంది. 
 
బ్రహ్మోత్సవాలకు ఆలయ పైభాగంలో రంగులు వేయడంవంటి పనులు చేస్తున్నా ఈ మొలకను ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. చాలా గోపురాలు కూలిపోవడానికి రావిమొక్కలే కారణమనే విషయం టీటీడీకి గుర్తుండాలని పలువురు విమర్శిస్తున్నారు.