శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (17:22 IST)

ప్రేమించుకున్నప్పుడు ఉన్న ఆనందం.. పెళ్ళి తర్వాత?

ప్రేమించుకున్నప్పుడు ఉన్న ఆనందం.. పెళ్ళి తర్వాత ఎందుకు లేదు గురూజీ..
 
ప్రేమ అనేది ఏదో కొంతకాలం ఉండిపోయేది కాదు. రూపం మారినంత మాత్రానో, బంధం వల్లనో, వయసైనందువల్లనో తరిగిపోయేదీ కాదు. ప్రేమ గొప్పతనాన్ని గుర్తించడానికి గడచిన కాలాన్ని నెమరు వేయటం అనేది దురదృష్టకరమైన విషయం. 
 
ఒక ఆస్పత్రిలో డాక్టర్లు మీటింగ్ ఏర్పాటు చేసుకొన్నారు. అత్యవసర చికిత్స విభాగంలో, రోజు పొద్దున్న 8 గంటలకు ఒకరు మరణిస్తున్నారు... కారణం?.
 
వైద్యపరంగా ఏ విధమైన వివరం తృప్తినివ్వలేదు. వైద్యనిపుణులకు ఏదీ ఆనందాన్నివ్వలేదు. ఆ సమయంలో ఏదాన్నా భూతప్రేతాలవంటి అమానుష్యశక్తి ఏదన్నా సరే దాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. నిర్ణయించుకున్న రోజున ప్రతి డాక్టర్ తన ఇష్టదైవాన్ని జపిస్తూ, అక్కడ ఒక పక్క దాక్కుకున్నారు. 
 
సరిగా ఎనిమిది గంటలకు తలుపు తెరుచుకుంది. లోపలకు వచ్చింది. ఒక ఊడ్చుకునే అమ్మాయి. ప్రాణాలు కాపాడే ఆ యంత్రానికున్న ప్లగ్‌ను తీసేసింది. అక్కడ వాక్యూమ్ క్లీనర్ ప్లగ్‌పెట్టి, గదిని శుభ్రం చేయసాగింది.
 
అలాగే మీరూ ప్రేమ అనే ప్లగ్ పీకేశారు. గడిచిన ఐదు ఏళ్ళుగా మీ కోరికలు, అలవాట్లు ఎన్ని ఏఏ మార్పులకు లోనయ్యాయి అన్నది ఆలోచించండి. మీ ఇద్దరికీ ఒకే రకం అనుభవం ఏర్పడుతుంది.