Widgets Magazine

పురుషాంగం ఆకృతిలో అత్యంత అరుదైన శివలింగం... ఎక్కడ?

బుధవారం, 3 జనవరి 2018 (14:25 IST)

gudimallam siva temple

ప్రపంచంలోని పురాతనమైన శివలింగాలలో ఒకటి ఈ పురుష అంగం ఆకృతిలో ఉన్న శివలింగం. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం గ్రామంలోని పరుశురామేశ్వరుని ఆలయంలో ఈ భిన్నమైన శివలింగం ఉంది. స్థల పురాణం ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని వధించి మళ్లీ తండ్రి వరంతోనే ఆమెను బ్రతికించుకుంటాడు. కానీ ఆయన తన తల్లిని చంపినందుకు బాధపడుతూనే ఉండేవాడు. ఆ తరుణంలో మునుల సలహా మేరకు శివుడిని ఆరాధించడానికి వెళ్తుండగా అడవి మధ్యలో ఈ శివలింగాన్ని దర్శించుకున్నాడు. అక్కడే ఒక సరోవరం ఏర్పాటు చేసుకున్నాడు. 
 
ప్రతిరోజూ అందులో ఒక్క పువ్వు మాత్రమే పూచేది, దానితో పూజ చేసేవాడు. అయితే అడవి జంతువుల కారణంగా ఈ పుష్పానికి హాని జరుగుతుందేమోనని కాపలాగా యక్షుడిని నియమించారు. ఆయన బ్రహ్మ భక్తుడు. ఒకరోజు పరుశురాముడు వచ్చేలోగానే యక్షుడు పుష్పంతో లింగానికి పూజ చేసాడు. పుష్పం లేకపోయేసరికి కోపోద్రిక్తుడై పరశురాముడు యుద్ధం ఆరంభించాడు. ఆ యుద్ధం పధ్నాలుగేళ్లు సాగింది. 
 
అప్పుడు ఆ ప్రదేశంలో పల్లం ఏర్పడినందున దీనికి గుడిపల్లం పేరు వచ్చింది. ఈ యుద్ధం ఎంతకీ ముగియకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారివురినీ శాంతపరిచి రెండుగా విచ్ఛిన్నమై ఇద్దరిలో కలిసిపోతాడు. అందుకే ఇక్కడ ఒక ఆకారం పరుశురాముడి చేతిలో వేటాడిన మృగంతోటి, రెండవది చేతిలో ఒక కల్లుకుండ, చిత్రసేనుడి ముఖం రూపంతో మలచబడిందని ఒక కథనం. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్టించబడిన శివలింగం మనిషి రూపంలో వేటిగాడి వలె ఉంటుంది. ఇక్కడ స్వామికి యజ్ఞోపవేతం లేకపోవడం మరో ప్రత్యేకత.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

టిటిడి ఉన్నతాధికారుల మరో సంచలన నిర్ణయం.. ఏంటది?

త్వరలో శ్రీవారి దర్శన టికెట్ల రేట్లు పెంపచేందుకు రంగం సిద్దం చేసింది టీటీడీ. ఆన్‌లైన్ ...

news

రుద్రాక్షలు- విశిష్టత ఏంటో తెలుసా? ఆ రుద్రాక్ష మన్మథ స్వరూపం..?

రుద్రాక్షలు వివిధ ముఖములు కలిగినవి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ముప్పది ఎనిమిది రకాల ...

news

మీ ఇంట్లో లక్ష్మీ కళ రావాలంటే..?

కొంతమంది ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు అర్థమైపోతుంది. ఆ ఇల్లు ఏ ...

news

శని దోషం వదిలించేందుకు ఈ చెట్టు, బిపి-చక్కెర వ్యాధులకు ఆ చెట్టు

జ్యోతిష శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత వున్నది. ఒక్కో నక్షత్రం వారు ఒక్కొక్క ...

Widgets Magazine