శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PYR
Last Modified: బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (10:19 IST)

టీటీడీతో శ్రీలంక ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుందా.. ఆయనెందుకు సంతకం చేస్తున్నారు?

అదేంటి ఆయన శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కదా..! అవును.. ఆయన మైత్రిపాల సిరిసేనే... అదేంటి ఆయనతో టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు సంతకం చేయిస్తున్నారు.. శ్రీలంక టీటీడీతో ఏదైనా ప్రత్యేక ఒప్పందాలు చేసుకుందా..? అయ్యోయ్యో... ఇంకా ఎక్కువ సేపు ఆగితే వేంకటేశ్వర స్వామిని శ్రీలంక పంపే ఆలోచన చేసినా ఆశ్చర్య పోనక్కర లేదు. సాంప్రదాయం ప్రకారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు సంతకం చేస్తున్నారంతే. వివరాలు...
 
సాధారణంగా తిరుమలకు వచ్చే విదేశీ ప్రముఖులు, ఇతర మతస్తులు వేంకటేశ్వసర స్వామిని దర్శించుకోవాలంటే మొదటగా ఆయనపై విశ్వాసాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. వేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉన్న ప్రముఖులు, ఇతర మతస్తులు మాత్రమే వేంకటేశ్వర స్వామి దర్శనానికి అర్హులవుతారు. అందుకే ఇలా విదేశీ ప్రముఖులు, ఇతర మతస్తుల వద్ద సంతకాలు చేయిస్తారు. ఇది వేంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేస్తుంది. 
 
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమల చేరుకున్న సందర్భంగా ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కలిశారు. ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం, భారతీయ సాంప్రదాయం ప్రకారం మర్యాదలు చేశారు. అనంతరం జేఈవో శ్రీనివాస రాజు ఆయన వద్ద ఆలయ సాంప్రదాయాన్ని తెలియజేసే పుస్తకంలో ఇలా సంతకం చేయించుకున్నారంతే.