శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:26 IST)

టిసిఎస్‌ కు తితిదే సేవల ఆన్‌లైన్‌ బుకింగ్‌లు

తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ఆన్ లైన్ బుకింగ్ విషయాలలో టాటా కన్సల్టెంట్ సర్వీసు సహకారం తీసుకోనున్నట్లు ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తెలిపారు. టిటిడి ఆన్‌లైన్ లో అందిస్తున్న శ్రీవారి దర్శన టికెట్ల ముందస్తు బుకింగ్‌, కరెంట్‌ బుకింగ్‌, ఇతర సేవలను టిసిఎస్‌ సంస్థ సాంకేతిక సహకారంతో వేగవంతం చేస్తామని వెల్లడించారు. 
 
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన టిసిఎస్‌ సంస్థ సిఈఓ చంద్రశేఖర్‌తో సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులకు అందిస్తున్న సేవలలో ఇన్‌ఫెర్మేషన్‌ టెక్నాలజిని చక్కగా వినియోగించేందుకు టిసిఎస్‌ సంస్థ సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సంస్థ అందించే టెక్నాలజితో టికెట్ల పరిశీలన, ఆన్‌లైన్‌ పబ్లికేషన్స్‌, టిటిడి వెబ్‌సైట్‌ మెయింటెనెన్స్‌ చేపడతామని ఈఓ వెల్లడించారు. 
 
ఈ కార్యక్రమంలో తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు, ఆర్ధిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి బాలాజి, ట్రాన్స్‌ పోర్టు జనరల్‌ మేనేజర్‌ శేషారెడ్డి, ఈడిపి మేనేజర్‌ భాస్కర్‌, ఈడిపి ఓఎస్‌డి బాలాజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.