బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (07:54 IST)

నేడు గురుపౌర్ణమి.. : కిటకిటలాడుతున్న ఆలయాలు

గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలను శోభాయమానం తయారు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం మనదేశంలో ఆనవాయితీగా మారింది. 
 
ఒక్క ఇండియాలోనే కాకుండా అమెరికాలాంటి దేశాల్లో ఏర్పాటైన సాయిబాబా ఆలయాల్లో నేటి తెల్లవారుజాముననే గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల ఆధ్యర్యంలో ఏర్పాటైన సాయిబాబా ఆలయం భక్తులతో నిండిపోయింది. 
 
ఇక సాయిబాబా ప్రధాన దేవాలయం షిరిడీలో మూడు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా బాబాను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు షిరిడీ వెళ్ళారు.