గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శనివారం, 28 మార్చి 2015 (10:35 IST)

టిటిడి బడ్జెట్ రూ. 2530 కోట్లు... కానుకల అంచనా రూ.905 కోట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం 2015-2016 ఆర్థిక సంవత్సరానికి గాను తన వార్షిక బడ్జెట్ ను విడుదల చేసింది. సాధారణంగా ఈ బడ్జెట్ ఎప్పుడూ ఓ చిన్న రాష్ట్ర బడ్జెట్ అంత ఉంటుంది. టిటిడి రూ. 2,530.10 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఖరారు చేసింది. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 2,401.69 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం అంతానికి సవరించిన అంచనాల మేరకు బడ్జెట్ రూ. 2,452.51 కోట్లుగా పేర్కొన్నారు. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు రూ. 905 కోట్లురావచ్చని అంచనా వేశారు. పెట్టుబడులపై వడ్డీ రూ. 744.91 కోట్లు, దర్శన టి కెట్ల విక్రయం ద్వారా రూ. 215 కోట్లు, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ. 50 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 145 కోట్లు, గదుల అద్దె ద్వారా రూ. 98.5 కోట్లు రావచ్చని అంచనావేశారు. 
 
ఒక్క తలనీలాల విక్రయం ద్వారా రూ. 200 కోట్లు, బంగారు డాలర్ల విక్రయంతో రూ. 15 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఉద్యోగుల రుణాలపై వడ్డీతో రూ. 37.39 కోట్లు, దుకాణాలు, హోటళ్ల అద్దెలు, టోల్‌గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 119.30 కోట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ఉద్యోగుల జీతాల కోసం రూ. 482 కోట్లు, పెట్టుబడులకు రూ. 681.24 కోట్లు, వివిధ కార్యక్రమాల అమలు, శాఖల నిర్వహణ కోసం రూ. 1,366 కోట్లు కేటాయించారు.