శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2015 (08:07 IST)

500 యేళ్ళ చరిత్ర కలిగిన కోదండ రామాలయాన్ని విలీనం చేసుకున్న టీటీడీ

చుట్టుపట్ల ఆలయాలను తనలో విలీనం చేసుకునే ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తోంది. దాదాపుగా 5 వందల యేళ్ళ చరిత్ర కలిగిన మరో కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తనలో విలీనం చేసుకుంది. 
 
16 శతాబ్ధంలో నిర్మితమైన కోదండ రామాలయం చంద్రగిరి పట్టణంలో కొలువుదీరి ఉంది. అయితే ఆలనా పాలనా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతిదేవస్థానంలో కలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి బుధవారం మధ్యాహ్నం ఆ పత్రాలను తీసుకున్నారు. దీంతో చంద్రగిరి కోదండ రామాలయం టీటీడీ గొడుగు కిందకు వచ్చినట్లయ్యింది. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు.