Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హిందూ వారసత్వ సంస్కృతి కుంభమేళాకు యునెస్కో గుర్తింపు

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (15:32 IST)

Widgets Magazine
kumbha mela

హిందువులు అత్యంతపవిత్రంగా భావించి నిర్వహించే కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. కుంభమేళాను వారసత్వ సంస్కృతిగా యునెస్కో ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన యునెస్కో 12వ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈనెల 4వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు 9 వరకూ జరుగుతాయి. వారసత్వ సంస్కృతి కల్పించడానికి రూపొందించిన లిస్టులో కుంభమేళాను చేర్చినట్టు సంస్థ తెలిపింది. లక్షలాది మంది హిందూ యాత్రికులు హాజరయ్యే కుంభమేళాకు వారసత్వ సంస్కృతి హోదాకు కల్పించడం సరైనదేనని యునెస్కో ప్రకటించింది. 
 
కుంభమేళా సమయంలో కోట్లాది మంది హిందువులు నది దగ్గరకు చేరుకుని వేడుక చేసుకుంటారు. ప్రపంచంలో అంత భారీ మొత్తంలో భక్తులు హాజరుకావడం ఒక్క కుంభమేళాకు మాత్రమే సాధ్యం. ఈ క్రమంలోనే కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ జాబితాలో బొత్సవానా, కొలంబియా, వెనీజులా, మంగోలియా, మొరాకో, టర్కీ, యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే వేడుకలు మాత్రమే ఉన్నాయి. 
 
దీనిపై కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మనీష్ శర్మ స్పందిస్తూ, 'మన కుంభమేళాకు ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ గర్వకారణం. ఇది అత్యంత అరుదైన గౌరవం' అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామ భాగపు స్తనాన్ని ఖండించింది... అదే...

ఒక రోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం ...

news

శ్రీ కృష్ణుడితో మాకేం పనుంది? రామ దర్శనానికైతే వస్తా: హనుమంతుడు

హనుమంతుడు కాలాతీతుడు. యుగాలు మారినా చిరంజీవిలా జీవిస్తున్నాడు. హనుమంతుని అనుగ్రహం పొందిన ...

news

నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి

విద్యావంతులలో చాలామంది అన్నీ తమకు తెలుసునని అనుకుంటారు. సత్యశోధన చేస్తారు. నిజమైన సత్యం ...

news

మంగళవారం 21 లడ్డూలు హనుమంతునికి సమర్పిస్తే?

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున నిష్ఠతో శుచిగా ...

Widgets Magazine