శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: బుధవారం, 25 మార్చి 2015 (11:06 IST)

లడ్డూ.. కావాలా.. ! దళారులకు అడ్డగా తిరుమల లడ్డూ..

రాజకీయ దళారీ.. రియల్ ఎస్టేట్ దళారీ.. అధికార దళారీ.. ఆధ్యాత్మిక దళారీ.. దళారీ తనం ఏదైనా వినియోగించిదే ఒక్కటే అదే తిరుమల లడ్డూ.. అధికారులు రాజకీయ ప్రముఖులు.. ఉన్నతాధికారులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూనే అడ్డా.. తిరుమల లడ్డూతోనే కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని తిరుమలలో వందల లడ్డూలు అనధికారకంగా బయటకు తీసుకెళ్లుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 
 
అలాంటిదే మంగళవారం ఒకటి తిరుమలలో బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. తిరుమల లడ్డూ కాస్తంత ముక్క దొరికితే పరమపవిత్రంగా కళ్లకు అద్దుకుని తినే వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ లడ్డూకు విపరీతమైన గిరాకీ వచ్చింది. అయితే వెంకన్న దర్శనం అనంతరం టోకెన్ల ద్వారా పొందాల్సిన అంతటి ప్రశస్తమైన ప్రసాదం లడ్డూలు ప్రస్తుతం పక్కదారి పడుతున్నాయి. 
 
ఒకటికాదు రెండు కాదు ఏకంగా 144 లడ్డూల్ని కలిగి ఉన్న ఓ భక్తుణ్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆలయ ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రాథోడ్గా అతణ్ని గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది.. పరిమితికి మించి లడ్డులు ఎలా దొరికాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్లుతున్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.