గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PYR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (11:01 IST)

తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు.. ఎందుకు? ఎన్నాళ్లు?

తిరుమలలో రెండు రోజుల పాటు విఐపిల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆది, సోమవారాల్లో ఉదయం బ్రేకు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం ప్రకటించారు. సోమవారం రథసప్తమి జరుగనున్నది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
ఆదివారం ఉదయం ప్రొటోకాల్‌ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. సోమవారం ప్రొటోకాల్ దర్శనాలు కూడా తక్కువగానే ఉంటాయని అన్నారు. రథసప్తమి రోజున అన్ని వాహనాలు ఒకే రోజు తిరుగుతాయి కాబట్టి రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.