బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By chitra
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2016 (12:05 IST)

మంగళసూత్రం ధరించడం ఫ్యాషన్ కాదు.. స్త్రీ ఆరోగ్యానికి మేలు

వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్ట

వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు. ఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు, ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. నిజానికి ఆడవారికి అది ఎంతో మేలు చేస్తాయి. 
 
మంగళ సూత్రాలు స్త్రీల పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పగడం సూర్యునికి - కుజునికి, ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది, నాడీ మండలాన్ని చురుకుగా ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేకాదు ముత్యం శరీరంలో అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను, సహనాన్నిచేకూరుస్తుంది.