శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 జులై 2016 (15:23 IST)

మహా సంగ్రామం.. కురుక్షేత్ర యుద్ధం.. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు?

ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ అంటూ పవిత్ర గ్రంథం ఉంది. అదే హిందువులకు మాత్రం పలు వేదాలున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ముందుగా హిందువులకు పవిత్ర గ్రంథంగా భ

ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ అంటూ పవిత్ర గ్రంథం ఉంది. అదే హిందువులకు మాత్రం పలు వేదాలున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ముందుగా హిందువులకు పవిత్ర గ్రంథంగా భగవద్గీతనే పేర్కొంటారు. భగవద్గీతలోని 18 తాత్పర్యాలను చదివి.. దానిప్రకారం జీవితాన్ని గడపడం ఉత్తమం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. అంతేకాదు.. ఏ పని చేసినా ప్రతిఫలం మాత్రం భగవంతునికే అర్పించడమే గీతాసారాంశం. 
 
భగవద్గీత ద్వారా జీవిత సారాంశాన్ని బోధించిన శ్రీ కృష్ణ పరమాత్ముడు.. కురుక్షేత్ర మహా సంగ్రామంలో పాండవుల పక్షాన నిలబడినందుకు గల కారణం ఏమిటని తెలుసుకోవాలనుందా? అయితే చదవండి. పాండవులకు, కౌరవులకు జరిగిన మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అందరి వాడు. అయితే పాండవులకే శ్రీకృష్ణుడు మద్దతివ్వాల్సిన అవసరం ఏమిటనే దానిపై ఆరా తీస్తే.. ఒకసారి ద్వారకకు అర్జునుడు, దుర్యోధనులిద్దరూ వెళ్తారు. యుద్ధానికి శ్రీకృష్ణుడి సాయం కోరుతారు.
 
శ్రీ కృష్ణుడేమో.. ఆయుధం చేతనెత్తనంటాడు. నిరాయుధునిగా యుద్ధరంగం ప్రవేశిస్తానంటాడు. నిరాయుధుడైన కృష్ణుడిని దుర్యోధనుడు కోరుకోడు. సేనాబలం కోరుకుంటాడు. అదే అర్జునుడు శ్రీకృష్ణుడే కావాలనుకుంటాడు.  ఆపై యుద్ధ మైదానంలోకి శ్రీకృష్ణుడి రథ సారథ్యంలో ప్రవేశించిన అర్జునుడు.. యుద్ధరంగంలో నిల్చున్న సేనలందరూ తన బంధువులు, సోదరులు, గురువులు కావడంతో శ్రీ కృష్ణునితో యుద్ధం వద్దంటాడు.
 
అప్పుడే శ్రీ కృష్ణుడు ధర్మ సంరక్షణార్థం బంధువులను, గురువులను, సోదరులను మట్టుబెట్టాల్సిన బాధ్యత నీపై వుందని గీతోపదేశం చేస్తాడు. నీ కర్తవ్యాన్ని నీవు చేస్తే.. ఆ ఫలితాలన్ని తనకే చేరుతాయని కృష్ణుడు ఉద్భోధిస్తాడు. అందుకే ఏ పని చేసినా ఫలితం ఎదురుచూడకూడదని అది దేవుడికే వదిలేయాలంటారు. ఇలా ధర్మాన్ని రక్షించేందుకు శ్రీ కృష్ణుడు పాండవుల పక్షాన నిలబడ్డాడు.