Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాండవుల్లో ధర్మరాజే స్వర్గానికి వెళ్ళారట.. మిగిలిన వారు...?

సోమవారం, 15 మే 2017 (14:06 IST)

Widgets Magazine

పాండవుల్లో ధర్మారాజు మాత్రమే స్వర్గానికి వెళ్ళారట. మిగిలిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళారట. అసలెందుకు ఆయన ఒక్కరే స్వర్గానికి వెళ్ళి మిగతా వారు నరకానికి వెళ్ళారు. తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత పాండవులు 36 ఏళ్ల పాటు ఇంద్రప్రస్థపురాన్ని పరిపాలించారు.

అయితే జీవిత చరమాంకంలో సన్యాసాన్ని స్వీకరించాలని ధర్మరాజు తన సోదరులు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదితో కలిసి హిమాలయాలకు పయనమయ్యాడు. పాండవులు హిమాలయాలకు బయలుదేరినప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుందట. ఓ కుక్క వారిని అనుసరిస్తూ వెంట నడిచింది.
 
హిమశిఖరాల వైపు సాగుతుండగా ధర్మరాజు తప్ప భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది ఒకరి తర్వాత ఒకరు అలసటతో కుప్పకూలిపోయారు. వీరిలో ముందు ద్రౌపది కింద పడిపోయింది. వారు కింద పడిపోయిన వెనుదిరిగి చూడకుండా యుధిష్టరుడు అలాగే నడుస్తుండగా కుక్క మాత్రం అతనికి తోడుగా నిలిచింది. తన సోదరులు, భార్య పడిపోయినా వెనుదిరిగి చూడకుండా శిఖరంపైకి చేరుకున్న ధర్మరాజుకు ఇంద్రుడు ఎదురొచ్చి స్వాగతం పలికాడు. తన రథంపై ధర్మరాజును స్వర్గానికి తీసుకెళ్లడానికి సిద్ధపడ్డాడు.
 
ధర్మరాజు గొప్ప నీతిజ్ఞుడు కావడం వల్ల మానవుడైనా దేవతల రథంపై కూర్చునే అర్హత సంపాదించాడు. ఇంద్రుడి రథంపై కూర్చున్న ధర్మరాజు తనతోపాటు ఇంతవరకు ప్రయాణించిన కుక్కను కూడా తీసుకొస్తానని అంటాడు. అయితే రథంలో చోటులేదని ఇంద్రుడు చెప్పడంతో కుక్కను ఒంటరిగా వదిలేసి తాను మీతో స్వర్గానికి రాలేనని ధర్మరాజు తిరస్కరిస్తాడు. అంతలోనే కుక్క స్థానంలో ఉన్న యమధర్మరాజు తన నిజరూపంలోకి వచ్చాడు. దీన్ని చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు.
 
నీవు చాలా నీతిపరుడవు.... అన్ని ప్రాణులపైనా నీవు అసాధారణ దయ చూపుతావు... నీ సోదరుల కంటే ఈ కుక్కనే ప్రియమైనదిగా భావించావు. అన్ని సందర్భాల్లోనూ నీ నీతివంతమైన ప్రవర్తనతో పురుషుల్లో ఉత్తమైన వ్యక్తిగా రూపొందావు. దాని వల్లే నీవు హిమాలయ శిఖరంపైకి ఎలాంటి అలసట లేకుండా చేరుకున్నావని యమధర్మరాజు తన కొడుకైన ధర్మరాజుని ఉద్దేశించి పేర్కొన్నాడట. 
 
తండ్రి మాటలు విని ఆనందపడిన ధర్మరాజు ఇంద్రుడి రథంలో స్వర్గానికి చేరుకుంటాడు. అప్పటికే ద్రౌపది, భీమార్జున నకులసహదేవులు కూడా అక్కడ ఉంటారు. ధర్మరాజు తన జీవితంలో ఒకే ఒక్క అబద్ధం పలికాడు. దీనివల్ల నరకంలో ఎలాంటి శిక్ష అనుభవించకుండానే స్వర్గంలో ప్రవేశించాడు. అయితే మిగతావాళ్లు మాత్రం వారు చేసిన పాపాలకు కొద్ది సమయం నరకంలో గడిపాల్సి వచ్చిందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Mahabharat Pandavas Drauapadi God Indra Yudhisthira's Dog

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

బొమ్మను దేవుడనుకుని పూజించవచ్చు... కానీ దేవుడే బొమ్మ అనుకోరాదు...

లోకంలో కనిపించే చెడు అంతా అజ్ఞాన ప్రభావమే. మానవుడు జ్ఞానిగానూ, విశుద్ధుడిగానూ ...

news

మనుషులకు-జంతువులకు తేడా ఎక్కడుంది?.. సద్గురు

జనాభాలో కనీసం ఒక్క శాతం మందికి కూడా వారిలో ఆధ్యాత్మిక ప్రక్రియ జరగటం లేదు. మిగిలిన ...

news

నా జీవితం శూన్యం అని రావణాసురుడు ఎప్పుడు అనుకున్నాడు?

లక్ష్మణుడు విడిచిన ఐంద్రాస్త్రం వాయువేగంతో వచ్చి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అతడి ...

news

కృష్ణార్జున స్నేహం గొప్పదా? కృష్ణకుచేలుర స్నేహం గొప్పదా?

"యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అంటూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా ...

Widgets Magazine