గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (16:26 IST)

కేన్స్‌లో ఇరగదీస్తున్న ఆంటీ ఐశ్వర్యారాయ్... తేలిపోయిన సోనమ్ కపూర్( ఫోటోలు)

అందాల సుందరి ఐశ్వర్యారాయ్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో అందాలతో మెరుపుతీగలా మెరిసిపోతూ మెరుపులు మెరిపిస్తోంది. సోనమ్ కపూర్ ఆ ఆంటీతో పోలికలేంటి అంటూ కొట్టి పారేసినా ఇపుడు ఐశ్వర్యా రాయ్ అందాల ముందు సోనమ్ కపూర్ తేలిపోతోంది. ఆరాధ్యకు తల్లి అయినా ఐష్‌ మెస్మరైజింగ్‌ బ్యూటీ ఇప్పుడు కేన్స్ ఫెస్టివల్లో చూపరులను కట్టిపడేస్తోంది.

సోనమ్ కపూర్ వంటి యువ హీరోయిన్లు ఐశ్వర్యా ఆంటీ అని అంటున్నప్పటికీ నా అందానికి ఏజ్‌తో పనిలేదని ఏవర్‌గ్రీన్‌ అందం తనదని నిరూపిస్తున్న సూపర్ సెక్సీ స్టార్ ఐశ్వర్యారాయ్ అందం ముందు ప్రపంచం మరొక్కసారి స్టన్‌ అయింది. ఐశ్వర్యా రాయ్‌ కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌ పైన మెరిసిపోయింది.

రెడ్‌ కార్పెట్‌ పై మెరిసిపోతోన్న ఈ సుందరి జజ్బాతో సిల్వర్‌ స్క్రీన్‌ రీ-ఎంట్రీకి సిద్ధమవుతోంది. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో మొనోక్రమోటిక్‌ వైట్‌ గౌన్‌పై బ్లాక్‌ స్పిక్ల్‌డ్‌ బొడిస్‌తో ఐష్‌ వయ్యారాలు పోతూ అందరి చూపును తనవైపు తిప్పుకుంది. 14 ఏళ్లుగా కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై కనిపిస్తున్న ఐష్ ఆరాధ్యకు తల్లిగా కొత్త లుక్‌తో మరోసారి తళుక్కుమంది. ఐష్ గ్లామర్ రహస్యం ఏమిటోనని ఇపుడు బాలీవుడ్ యువ హీరోయిన్లు తెగ చర్చలు జరుపుకుంటున్నారు.


సోనమ్ కపూర్ ఏమంటుందో... దిసీజ్ సోనమ్ లుక్