మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2016 (12:26 IST)

బ్రాట్ పిట్-ఏంజెలీనా జోలీ విడాకులు.. పిల్లలు మాత్రం జోలీ వద్దే పెరుగుతారట..

హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకులే ప్రస్తుతం హాలీవుడ్‌లో హాట్ టాపిక్. వీరిద్దరూ తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తమ వద్దనున్న పిల్లల పెంపకంపై ఒప్పందానికి వచ్చేశారు.

హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకులే ప్రస్తుతం హాలీవుడ్‌లో హాట్ టాపిక్. వీరిద్దరూ తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తమ వద్దనున్న పిల్లల పెంపకంపై ఒప్పందానికి వచ్చేశారు. ఆరుగురు పిల్లలను ఏంజెలినా జోలీ వద్ద ఉంచేందుకు బ్రాడ్ పిట్ అంగీకరించాడు. దీంతో మాడెక్స్ జోలీ-పిట్(15), పాక్స్ జోలీ-పిట్(12), జహారా జోలీ-పిట్(11), షిలోహ్ జోలీ-పిట్(10), కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్(8)... ఏంజెలినా జోలీ దగ్గర పెరగనున్నారు. వీరిని కలిసేందుకు బ్రాడ్ పిట్‌కు జోలీ అనుమతి ఇచ్చింది. 
 
అంతేకాదు తండ్రిని చూడాలని పిల్లలు కోరుకుంటే అభ్యంతరం చెప్పబోనని జోలీ హామీయిచ్చింది. పిల్లల సంరక్షణ నిపుణుల ఆధ్వర్యంలో కుదిరిన ఈ ఒప్పందంపై బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వారం క్రితం సంతకాలు చేశారని సమాచారం. బ్రాడ్, జోలీ 12 ఏళ్లపాటు కలిసి సంసారం చేశారు. అయితే ఇటీవలే విడాకులతో విడిపోయారు. 
 
బ్రాడ్ పిట్ అంతకుముందు జెన్నిఫర్ అనిస్టన్ నుంచి విడిపోయాడు. ఏంజెలినా జోలీ మూడోసారి విడాకులు తీసుకుంది. అంతకుముందు ఆమె బిల్లీ బాబ్ థొర్నటన్, జానీ లీ మిల్లర్‌తో వైవాహిక బంధాన్ని తెంచుకున్న సంగతి తెలిసిందే.