శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By pyr
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2015 (11:02 IST)

సమంతకు టిక్కెట్టిన కొత్త భామ... ఎప్పుడు? ఎక్కడ?

సమంత పేరు చెబితేనే సినిమా పరిశ్రమ మినిమం గ్యారంటీ అనే దశలో ఉన్న తార. ఆమె సినిమాలో ఉంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మే నిర్మాతలు ఉన్నారు. అయితే ఆమెతోపాటు ఓ సినిమాలో కీరోల్ పోషించడానికి త్రివిక్రమ్ ఓ అమ్మడ్ని సెలక్ట్ చేశాడట. ఆ అమ్మడు కీ రోల్ అయితే ఇప్పటికే ఎంపికైన సమంత పాత్రం ఏంటనే విషయంపై ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటనేగా మీ అనుమానం రండీ వివరాలు తెలుసుకుంది. 
 
త్రివిక్రమ్ - నితిన్ న్యూప్రాజెక్ట్‌లో సమంతను ఎంపిక చేశారు. ఆమెకు తోడుగా అనుపమ పరమేశ్వరన్ అనే ఓ బ్యూటీని కూడా ఎంపిక చేశారట.  మోలీవుడ్‌లో హిట్టయిన ‘ప్రేమమ్’ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన అనుపమ ఇక్కడ కూడా తెలుగులో ‘అ...ఆ’ టైటిల్‌తో త్రివిక్రమ్ రీమేక్ చేస్తున్న సినిమాలో ప్రముఖ పాత్రే పోషిస్తోందట. 
 
హైదరాబాద్‌‌లో జరిగిన స్క్రీన్ టెస్ట్‌కు అనుపమ రావడం, డైరెక్టర్ ఓకే చేయడం కూడా జరిగిపోయాయట. అయితే ‘ అ.. ఆ’లో అనుపమది మెయిన్‌రోల్ అయితే సమంత పోషించే పాత్ర ఏంటి? అనుపమ సమంతకు టిక్ పెడుతోందా..?