శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By Selvi
Last Updated : గురువారం, 26 జూన్ 2014 (17:37 IST)

మత్తు మాయలో పడితే.. చీకట్లో కలిసిపోవడం ఖాయం!

మత్తు మాయలో పడితే.. చీకట్లో కలిసిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మత్తు మాయలో పడి ఎందరో సెలబ్రిటీల జీవితాలు నాశనమైపోయాయని వారు ఉదహరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న పలువురు సెలబ్రిటీలు చివరికి మత్తుమాయలో చీకట్లో కలసిపోయారు.
 
మత్తు ఎంతలా జీవితాలను నాశనం చేస్తుందో చెప్పడానికి వారు సాక్ష్యాలుగా మిగులుతున్నారు. హాలీవుడ్ చరిత్రను ఒక్కసారి గమనిస్తే ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. యావత్ ప్రపంచాన్ని తమ అందచందాలు, నటన, ఆటపాటలతో అలరించిన ఎందరో డ్రగ్స్‌కు బానిసలయ్యారు. చివరికి వాటివల్లే ప్రాణాలపైకి తెచ్చుకున్నారు.
 
హాలీవుడ్ చరిత్రలో అత్యంత అందగత్తె మార్లిన్ మన్రో.  వరల్డ్ లీడింగ్ సెక్స్ సింబల్‌. ఇప్పటికీ మన్రో డ్రెస్‌, స్టైల్‌, గెటప్‌ను ఫాలో అవుతున్నామంటే ఆమె క్రియేట్ చేసిన ట్రెండ్ ఎలాంటిదో అర్థమవుతుంది. కానీ మన్రో స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయిందంటే ఆశ్చర్యపోక తప్పదు. లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్ హోమ్‌లో ఆగస్టు 4, 1962న స్పృహలేకుండా కనిపించింది. డ్రగ్ ఓవర్ డోస్‌ వల్లే మన్రో కోమాలోకి వెళ్లి చనిపోయినట్లు నిర్థారించారు.
 
కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్..  ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్న మ్యూజిక్ లెజెండ్. 50 నైట్ కమ్‌ బ్యాక్ టూర్‌ రిహార్సల్స్ చేస్తూ చాలా అలసటకు గురవుతుండేవారు. ఆ సమయంలో ఆయన రిలాక్సేషన్ కోసం మెడిసిన్ తీసుకోవాలనుకున్నారు. 
 
మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో జూన్ 25, 2009లో ఆయన అర్థాంతరంగా కన్నుమూశారు. ఆయనకు డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చిన ఆయన డాక్టర్ ముర్రే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వీరి బాటలోనే విట్నీ హౌస్టన్, అమీ విన్‌హౌజ్, హీత్ లెడ్జర్‌లు సైతం మత్తు మాయలో మరణించినవారే.. ఇదే కల్చరే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ కొనసాగుతోంది. బహిర్గతంగా కాకపోయినా.. చాటుమాటుగా భారత స్టార్లు కూడా మత్తుమందుకు బానిసవుతున్నారు. వీరి బాటలోనే ప్రస్తుత యువత కూడా మత్తుమందులకు బానిసలైపోతున్నారు.