శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (07:08 IST)

మరో తొలిప్రేమే : నితిన్

‘చిన్నదాన నీ కోసం’ చిత్రం పవన్‌కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ తరహాలో ఉంటుందని సినీ హీరో నితిన్ అన్నారు. మంచి హాస్యం, స్వచ్ఛమైన ప్రేమ కథ చిన్నదాన నీకోసం సినిమా ఉంటుందని తెలిపారు.  కాలినడకన శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 
 
దర్శనం అనంతరం నితిన్ మీడియాతో మాట్లాడుతూ, తాను నటించిన చిన్నదాన నీ కోసం చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సు ల కోసం వచ్చినట్టు తెలిపారు. ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుమలకు రావటం ఆనవాయితీగా వస్తోందన్నా రు. 
 
వచ్చే ఏడాది మార్చిలో ‘కొరియర్ బై కల్యాణ్’ చిత్రం కూడా అభిమానుల ముందుకు రానుందన్నారు. ఆయనతో పాటు నటి  మిస్త్రి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత ఎస్వీయు జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.