గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (14:53 IST)

పేలిపోయిన విమానం.. గాయపడిన హాలీవుడ్ హీరో హారిసన్‌..!

'ఇండియానా జోన్స్' చిత్రం ద్వారా అమిత ప్రాచుర్యం పొందిన అలనాటి హాలీవుడ్ హీరో హారిసన్ ఫోర్డ్ విమాన ప్రమాదంలో చిక్కుకుని గాయాలపాలయ్యాడు. లాస్ ఏంజెలెస్‌లో రెండు సీట్లున్న చిన్న విమానాన్ని తానే నడుపుకుంటూ వెళ్లి ఆయన స్థానిక ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసేందుకు యత్నించగా గోల్ఫ్ కోర్టులో విమానం పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో ఫోర్డ్ తలకు తీవ్ర గాయం ఏర్పడింది. దీంతో చికిత్స కోసం ఆయన్ను హుటాహుటిన సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు విభాగ ప్రతినిధి మహిళా అధికారి ఒకరు తెలిపారు. ఈ చిన్న విమానం సాంకేతిక లోపం కారణంగానే పేలిపోయిందంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.