శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (11:55 IST)

డేటింగ్ వద్దంటే మా అమ్మాయిలు నాతో గొడవపడ్డారు... ఏం చేయను... సిల్వెస్టర్

40 సంవత్సరాలు వచ్చేవరకు అలాంటి పనులకు అంగీకరించవద్దని తాను తన కూతుళ్ళకు సలహా ఇచ్చానని  సిల్వెస్టర్ స్టాలోన్ అన్నారు. అయినా వారు తనతో గొడవ పడ్డారని తెలిపారు. తండ్రిగా తాను చెప్పాల్సింది చెప్పానని, ఆపై వారిష్టమని ఆయన అన్నారు. తన మాట వినలేదని వాపోయారు. 
 
ఎక్స్పాండబుల్ వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ చిత్రాల్లోనటించిన ఆయన తనకు సోఫియా(18), సిస్టీన్ (16), స్కార్లెట్ (13) అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారని చెప్పారు. నాలుగేళ్ల క్రితమే ఓ అబ్బాయి తన పెద్దమ్మాయిని డేటింగ్కు పిలిస్తే తండ్రిగా అనుమతించేందుకు నిరాకరించానని చెప్పారు.  '40 సంవత్సరాలు దాటేవరకు డేటింగ్కు అనుమతించవద్దని నేను నాముగ్గురు కూతుర్లకు చెప్పాను.
 
సోఫియాకు పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు ఓ అబ్బాయి డేటింగ్కోసం అడిగాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి నేను అనుమతించలేకపోయాను. కానీ, నా కూతురు నా మాట వినలేదు. చివరికి జాగ్రత్తలు కూడా చెప్పాను' అని ఆయన వివరించారు.