గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By pnr
Last Updated : మంగళవారం, 19 జనవరి 2016 (08:34 IST)

నా రేటు రూ.10 కోట్లు.. నా భర్త కూడా కాదనరు: లండన్ బ్యూటీ కైటీ ప్రైస్ ఆఫర్

లండన్ బ్యూటీ కైటీ ప్రైస్ కోటీశ్వరులకు తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే మూడో వివాహం చేసుకున్న ఈ గ్లామరస్ మోడల్... ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనదేమీ లేదని సెలవిచ్చింది.
 
అలాగే పనిలో పనిగా ప్రపంచ ధనవంతులకు ఓ బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చింది. 'రూ.10 కోట్లు (ఒక మిలియన్) ఇస్తే నా శరీరాన్ని (సెక్స్‌) అమ్మేస్తాను' ఎంచక్కా అనుభవించవచ్చునంటూ ప్రకటించి సంచలనం రేపిందీ 37 యేళ్ళ పాపులర్‌ టీవీ స్టార్‌. 'లూజ్‌ ఉమెన్' అనే టీవీ చర్చలో భాగంగా కేటీ ఈ బంపర్‌ ఆఫర్‌ను బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. 
 
అదేసమయంలో ఇలా ప్రకటించడంపై కూడా వివరణ ఇచ్చుకుంది. 'ఇలా ప్రకటించానని నన్ను వ్యభిచారిణిగా చూడవద్దు. నేనూ మహిళనే. నాకు విలువలు ఉన్నాయి. కానీ, రూ.10 కోట్ల రూపాయలు ఎవరైనా ఇస్తారంటే నా శరీరాన్ని అమ్మేసేందుకు సిద్ధమే. అయితే ఈ విషయంలో నా మూడో భర్త అనుమతి తప్పనిసరి. అయినా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటాడు' అని సెలవిచ్చింది. కేటీ ప్రకటన ఇపుడు సోషల్‌ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.