శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By pyr
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2015 (06:35 IST)

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రవీనా టాండన్‌కు అవమానం...! ఎక్కడ? ఏం చేశారు?

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు లాస్‌ఏంజిల్స్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సినీ నటి రవీనా టాండన్ కూడా హాజరయ్యాయి. అక్కడి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. తనతోపాటు స్టేజిపై ఉన్న ఓ వ్యక్తి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట. వీకెండ్ కావడంతో ఆ వ్యక్తి ఫుల్లుగా మందుకొట్టి అసభ్యకరంగా వ్యవహరించారట. రవీనానే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 
 
ఆ వ్యక్తి పిల్లలను తన కారులో తీసుకురాలేదన్న అక్కసుతో ఆ వ్యక్తి అలా ప్రవర్తించాడని రవీనా వెల్లడించింది. తాను సహనంతో మాట్లాడినా ఆ వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడని, ఆ వ్యక్తి పిల్లలను తన కారులో తెచ్చేందుకు సెక్యూరిటీ, ప్రోటోకాల్ సహకరించలేదని ఆమె తెలిపారు. దీనిని స్టేజిపై ఉన్న ఇతరులకు చెప్పగా, ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లారని, దీంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగినా మూడ్ ఆఫ్ అయిపోయిందట.