శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (05:47 IST)

దీపికా చూపిన అందాలు చూసేందుకు రెండు నేత్రాలు సరిపోలేదు.. విన్ డీజిల్

హాలీవుడ్ నటుడు విన్ డీజిల్. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. వీరిద్దరు కలిసి నటించిన హాలీవుడ్ చిత్రం "ట్రిపులెక్స్‌ ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్". ఈ చిత్రం శనివారం భారత్‌లో విడుదలైంది. హాలీవుడ్‌లో కంట

హాలీవుడ్ నటుడు విన్ డీజిల్. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. వీరిద్దరు కలిసి నటించిన హాలీవుడ్ చిత్రం "ట్రిపులెక్స్‌ ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్". ఈ చిత్రం శనివారం భారత్‌లో విడుదలైంది. హాలీవుడ్‌లో కంటే.. భారత్‌లోనే ముందుగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమం ముంబైలో నిర్వహించారు. ఇందులో విన్ డీజిల్‌, దీపికా, ఇంకా ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. 
 
ఆ సందర్భంగా విన్ డీజిల్‌ దీపిక పదుకొణె తన అందాలతో పాటు.. ముంబై ప్రదేశాలను చూపించారు. అలాగే, స్థానిక వంటలను కూడా రుచి చూపించారు. అందులోభాగంగా ఇద్దరూ గల్లీలో చాయ్‌ కూడా తాగారు. ఆ విషయాన్ని విన్ డీజిల్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. "ఛీర్స్‌ టు ఇండియా, మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు" అని ట్వీట్‌ చేశారు. దాంతో పాటు దీపికతో కలిసి గాజు గ్లాసులో టీ తాగుతున్న ఫోటోను పోస్ట్‌ చేశారు. అంతేనా.. దీపిక కోసం తాను ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్టు హాలీవుడ్ హీరో ప్రకటించడం గమనార్హం.