తమలపాకు ఓ దివ్యౌషధం...!

తమలపాకులను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యం

Gulzar Ghouse|
** దగ్గు, కఫం, శ్వాస సంబంధిత జబ్బులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

** దెబ్బలు తగిలి వాపు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరిగినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డ కట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

** పులిపిరులున్నవారు తమలపాకు కాడను సున్నంలో కలిపి ఒక వారంపాటు ఆ పులిపిరులపై పూయండి. దీంతో పులిపిరులు రాలిపోతాయి.

తమలపాకు ఓ ఔషధంలాంటిది. కాని దీనిని ఎక్కువగా తీసుకుంటే రోగాలబారిన పడతారంటున్నారు వైద్యులు. ఇందులో ప్రముఖంగా దంతదౌర్బల్యం, రక్తహీనత(ఎనీమియా), కంటి జబ్బులు మరియు ముఖానికి సంబంధించిన రోగాలు వస్తాయంటున్నారు వైద్యులు.

తమలపాకును భోజనం తర్వాత తీసుకోవడంతో నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. కాని కొంతమంది దీనిని నిత్యం వాడుతుంటారు. ఇది మంచిదికాదంటున్నారు వైద్యులు.

తమలాపాకును వేసుకునేవారు తమ శరీరంలోని అలసటను దూరంచేసుకుంటుంటారు. దీనిని కొంతమంది అలవాటుగా చేసుకుని బానిసైపోతుంటారు. దీంతో అనారోగ్యంబారిన పడుతుంటారని వైద్యులు సూచిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :