బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (17:20 IST)

ఆక్రోట్‌తో మతిమరుపు మటుమాయం..!

నేటి ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌లో పోషక విలువల లోపం మెండుగా ఉంది. దీంతో మనషికి శారీరకంగానూ, మానశికంగాను అనేర రకాలైన సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి వాటిలో అతి ముఖ్యమైనది మతిమరుపు సమస్య. ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరినీ వేదిస్తుంది. తద్వారా ఇంటా బయటా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి వారు రోజూ గుప్పెడు అక్రోట్ ఫ్రూట్‌ను తింటే మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని ఓ అధ్యయనం ద్వారా తేలింది.
 
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన లెనోర్ అరబ్ అనే వైద్య నిపుణుడు మెదడుపై డ్రై ఫ్లూట్ల పనితీరును గురించి ఇటీవల ఓ అధ్యయనం చేశారు. అప్పుడు ఆక్రోట్లను అధికంగా తీసుకున్న వ్యక్తుల మెదడు అతిచురుగా పని చేస్తున్నట్టు తెలిసింది.
 
అక్రోట్లలో అనేక రకాల విటమిన్లు, ఖనిజలవణాలతోపాటు యాంటీఆక్సిడాంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉన్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అనే వృక్ష సంబంధ ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్ హృదయ, మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకారి. ఇది మతిమరుపుని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుందని లెనోర్ అరబ్ వెల్లడించారు.