శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chitra
Last Updated : శనివారం, 9 జనవరి 2016 (11:38 IST)

కూలింగ్‌ ఏజెంట్‌లా పనిచేసే కలబంద : అలర్జీకి మచ్చలకు చెక్ ఎలా?

పచ్చటి రంగుతో జిగురుగా ఉండే కలబంద ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే నమ్ముతారా అవుననే అంటున్నారు వైద్యులు. కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. రకరకాల అనారోగ్య సమస్యలు, సౌందర్య సమస్యల పరిష్కారానికి కలబందతో ఎన్నో విధాలుగా ఉపయోగపడతుంది.
 
కలబంద గుజ్జును శరీరంలోని అన్నిభాగాలపైనా రాయొచ్చు. కలబంద చూర్ణాన్నినీటిలో కలిపి తాగితే చర్మ సమస్యలు తలెత్తవు. శరీరారోగ్యానికి కూడా ఎంతో మంచిది. కలబంద కాండంపై ఉండే తొక్కు తీసేసి అందులోంచి జెల్‌ని తీస్తారు. దీన్ని ముఖానికి ఫేస్‌ మాస్క్‌లాగా కూడా వాడొచ్చు. కలబందలోని జెల్‌ చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు శరీర లోపలి భాగాలను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. కలబంద జెల్‌ యాంటిఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కూలింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది. 
 
చర్మంపై వచ్చే అలర్జీని పోగొడుతుంది. మంచి మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వారికి కూడా ఇది ఎంతో మంచిది. కలబంద జెల్‌ శిరోజాలకు కూడా మంచిది. తలస్నానానికి ముందు కలబంద గుజ్జుని తలకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు మెరిసిపోతుంది. గాయాలున్నచోట కలబంద రాస్తే మచ్చలు తగ్గిపోతాయి.