శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : మంగళవారం, 2 డిశెంబరు 2014 (16:45 IST)

పసుపుతో మతిమరుపుకు చెక్...! పరిశోధనలో తేలింది...

సౌభాగ్యానికి, సాంప్రదాయానికి పేరుపొందిన పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసుకును. వాటితో మహిళల సౌందర్యమే కాదు ఆర్యోగం కూడా పొందవచ్చును.
 
ప్రతిరోజూ ఒక గ్రాము పసుపు తినేవారికి అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి దూరంగా ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. పరిశోధకులు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు రోజుకో గ్రాము పసుపు ఇచ్చి చూడగా వారిలో వ్యాధి ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు, తీవ్రత తగ్గినట్లు గుర్తించారు. పసుపు ఒక్కటే కాకుండా, మిరియాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.