Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నల్లేరుతో పచ్చడి, పెసరట్టు తింటే..?

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (15:09 IST)

Widgets Magazine
cissus

నల్లేరులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎముకలకు నల్లేరు ఎంతో మేలు చేస్తుంది. నరాల బలహీనతను దూరం చేస్తుంది. రక్తప్రసరణలో ఎదురయ్యే రుగ్మతలను నయంచేస్తుంది. మధుమేహాన్ని దరిచేరనివ్వదు. రెండు స్పూన్ల తమలపాకురసంతో అర స్పూన్ తేనె కలిపి తీసుకుంటే నరాలు బలపడతాయి. నల్లేరు భస్మాన్ని పావు స్పూన్ తీసుకుని.. అందులో పావు స్పూన్ జాజికాయ పొడిని చేర్చాలి. వీటిని అరస్పూన్ నెయ్యిలో కలిపి రాత్రి నిద్రించేటప్పుడు తీసుకుంటే కండరాలకు, నరాలకు మేలు చేస్తుంది. నరాల వ్యవస్థను ఇది బలపరుస్తుంది. 
 
నల్లేరు పచ్చడిని వృద్ధులు తీసుకుంటే కీళ్ల నొప్పులు దూరమవుతాయి. నల్లేరును గ్రామాల్లో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. ఇందులో విటమిన్ సి, కెరోటిన్ ఎ, క్యాల్షియం అధిక మోతాదులో వుంటుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయ్యే ''మ్యూకోపాలిసాక్రైడ్స్'' నల్లేరులో అధికంగా వుంటాయి. నల్లేరు కాడలను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఆ పొడితో శొంఠి పొడిని సమపాళ్లతో కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని జబ్బు, దగ్గు ఉన్నవారు రోజుకు అర స్పూన్ మేర తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇక చెవిపోటును నల్లేరు రసం దూరం చేస్తుంది. నల్లేరు కాడల పేస్టును పెసరట్టు పిండిలో కలిపి దోసెలు పోసుకుంటే ప్రసవానికి అనంతరం మహిళల్లో శక్తి లభిస్తుంది. ఇంకా ఎముకలకు మేలు జరుగుతుంది. నువ్వులనూనెలో వేయించి రెండు పలకల నల్లేరును వంటల్లో వాడాలి. సంతానలేమికి చెక్ పెట్టొచ్చు. నల్లేరు లేత కాడను నువ్వుల నూనెతో రుబ్బుకుని జారగా తీసుకుంటే సంతాన లేమిని దూరం చేసుకోవచ్చు.
 
ప్రస్తుతం ఒబిసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారు నల్లేరు జ్యూసును తీసుకోవచ్చు. ఇది కెలోరీలను బర్న్ చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడం ద్వారు సులభంగా బరువు తగ్గుతారు. తద్వారా హృద్రోగ వ్యాధులు దరిచేరవు. నల్లేరు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వైఫైతో ఆరోగ్యానికి హాని... నిజమే.. తస్మాత్ జాగ్రత్త

ఈ రోజుల్లో నగరాల్లో వైఫై లేని ఇళ్ళు, ఆఫీసులు ఊహించడమే కష్టం. ఇళ్ళు, కార్యాలయం, ...

news

రోజూ గ్లాసుడు బత్తాయి రసం తాగితే..

బత్తాయి రసంలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ ...

news

శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే వాము

శీతాకాలంలో వాము వేసి మరిగించిన నీటిని సేవించడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా వుంటుంది. ఈ ...

news

మీరు రాత్రి సమయంలో పుట్టారా.. అయితే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే..

ప్రపంచంలో పుట్టిన మనుషులందరిలోను బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన ...

Widgets Magazine