శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: బుధవారం, 2 నవంబరు 2016 (15:01 IST)

తేనెలో నిల్వ చేసిన ఉసిరికాయ పరగడుపున రోజుకొకటి తింటే...?

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, ఎన్నో అనారోగ్యాలన

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, ఎన్నో అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఒక చిన్న జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్దిరోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. 
 
ఈ తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. వయస్సు మీద పడడం వల్ల చర్మం ముడతలుగా తయారవుతుంటుంది. అయితే పైన చెప్పిన తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే దాంతో ఆ ముడతలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది.
 
ఈ చలి కాలంలో ఆస్తమా అనేది చాలామందిని ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనె, ఉసిరి మిశ్రమంలో ఉండే సహజసిద్ధమైన పోషకాలు ఆస్తమాను దూరం చేస్తాయి. శ్వాస కోశ సమస్యలు రాకుండా చూస్తాయి.
 
తేనెలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. దీంతో ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి. చలికాలం మన జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. తిన్నది ఓ పట్టాన జీర్ణం కాదు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే ఆ సమస్య ఉండదు. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. 
 
అంతేకాదు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచిది. దీంతో ఆకలి పెరుగుతుంది. మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమంతప్పకుండా సేవిస్తుంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీనివల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది స్థూలకాయం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.