హారతి కర్పూరంలో ఇంగువను కలిపి మాత్రగా తీసుకుంటే...

బుధవారం, 4 అక్టోబరు 2017 (18:49 IST)

Ayurvedam

ఇంగువ గురించి చెప్పగానే దాని వాసనను భరించలేము నాయనోయ్ అనుకుంటారు. కానీ ఇంగువతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. 
 
1. పొంగించిన అరగ్రాము ఇంగువను ఆవు నెయ్యితో కలిపి ప్రతిరోజూ మూడు పూటలా తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. 
 
2. 10 గ్రాముల హారతి కర్పూరంలో, 10 గ్రాముల పొంగించిన ఇంగువను కలిపి నూరి, కంది గింజంత సైజు మాత్రలు చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే ఉబ్బసం నుంచి ఉమశమనం లభిస్తుంది. 
 
3. ఇంగువ కొంచెం వేడిచేసి, పిప్పి పంటిలో ఉంచితే బాధ తగ్గుతుంది.
 
4. పెసర గింజంత ఇంగువను నీళ్లలో కరిగించి నొప్పి వున్నవైపు ముక్కులో 3 చుక్కలు వేసుకుని నస్యంగా పీలిస్తే పార్వ్శపు నొప్పి తగ్గిపోతుంది. 
 
5. ఇంగువ, సైందవ లవణం, శొంఠి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని 30 గ్రాముల ఆవనూనెలో కలిపి నూనె మాత్రమే మిగిలేలా వేడి చేయాలి. ఆ నూనె 4 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది. 
 
6. పొంగించిన ఇంగువను మంచినీళ్లలో అరగదీసి, ఆ గంధాన్ని కాలిన చోట లేపనంగా రాస్తే గాయాలు తగ్గిపోతాయి. అరగ్రాము ఇంగువను అరకప్పు నీటిలో కలిపి తాగితే లోబీపీ సమస్య తొలగిపోతుంది.
 
7. పొంగించిన ఇంగువకు సమానంగా నల్ల ఉప్పు కలిపి చూర్ణం చేసుకోవాలి. తేనెలో పెసర గింజంత పరిమాణంలో ఈ చూర్ణం కలిపి నాకిస్తే పిల్లల్లో కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేటిలో వేటిని కలపుకుని తినకూడదో తెలుసా?

రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. ...

news

అలా చేస్తే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మాయం...

ఆరోగ్యంగా వుండేందుకు పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఎందుకంటే ...

news

క్యారెట్ జ్యూస్‌తో స్పెర్మ్ కౌంట్ అప్..

క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా ...

news

వంకాయ కూరతో బరువు తగ్గండి..

వంకాయలో కొలెస్ట్రాల్ ఏమాత్రం లేదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అందుకే బరువు ...

Widgets Magazine