వేపాకుతో మెరిసిపోయే జుట్టు మీ సొంతం

శనివారం, 9 జనవరి 2016 (09:57 IST)

వేపచెట్టును సహజగుణాల నిధిగా పిలుస్తుంటారు. దీనికి సర్వరోగ నివారిణిగా కూడా పేరుంది. వేపాకు, బెరడు, విత్తనాలు, వేర్లు ఇలా అన్నీకూడా మనకు ఉపయోగకరమే. అలాంటి వేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వేపాకు మనకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం!
 
వేపనూనెతో వారానికి రెండుసార్లు తలకి మసాజ్‌ చేస్తే జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు పోతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది. 
 
జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకును దంచి ఆ పేస్ట్‌ని తలకి పట్టించి తల స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. 
 
తలలో ఎక్కువగా దురద పెడుతుంటే వేపాకులు నాన బెట్టిన నీళ్లతో తలను శుభ్రపరిస్తే చక్కటి గుణం కనిపిస్తుంది. 
 
ఒక బౌల్‌లో వేపాకుపేస్ట్‌ని తీసుకుని అందులోకి గుడ్డు తెల్లసొన వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమాన్నితలకు పట్టిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.
 
వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పలురకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

హెల్త్ టిప్స్: ఎండు ఖర్జూరంలో తేనె కలుపుకొని తాగితే?

పంటినొప్పితో బాధపడే వారు నిమ్మరసం లో ఇంగువ కలిపి కొద్దిగా వేడి చేసి ఈ రసాన్ని కొద్దిగా ...

news

బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు

ఆహారాన్ని నమిలి తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. రోజూ తీసుకునే ఆహారాన్ని ...

news

పైత్యాన్నితగ్గించే మెంతికూర

మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసుల్లో మెంతులు ఒకటి. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో ...

news

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే "విట‌మిన్ సి"

'విట‌మిన్ సి' ఆహార‌మంటే అధిక శాతం వ‌ర‌కు పులుపుగానే ఉంటుంది. కానీ ఈ రుచిని ...