శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: శనివారం, 4 మార్చి 2017 (22:15 IST)

చేమకూరలో తేనె కలిపి సేవిస్తే ఏమవుతుంది?

చేమదుంపల గురించి తెలియనివారుండరు. దుంపలను సాగు చేస్తే వాటి నుంచి వచ్చేవే చేమ మొక్కలు. ఈ మొక్కల ఆకు కూరనే చేమకూర అంటారు. ఈ ఆకులు కూరగాను, పప్పు కూరగానూ, వేపుడు గానూ, పులుసుగానూ వాడుకోవచ్చు. ఇకపోతే ఈ ఆకు కూరలో ఔషధ గుణాలున్నాయి. అవేంటో ఒక్కసారి చుద్దాం.

ఈ కూర విష దోషాలను హరిస్తుంది. కామెర్ల వ్యాధి నుంచి కాపాడుతుంది. ఈ ఆకులు నూరి దాని రసాన్ని కడితే అధిక రక్తస్రావంతో వున్న గాయాలు, పుండ్లు త్వరగా తగ్గిపోతాయి. ముక్కు నుండి, ఇతర రక్త నాడుల నుండి స్రవించే రక్తాన్ని కూడా ఈ ఆకురసం అరికడుతుంది. ఈ ఆకు రసాన్ని ఒకటి రెండుబొట్లు ముక్కులో వేసుకుంటే ముక్కు నుంచి రక్తం పడేవారికి తగ్గిపోతుంది. 
 
మూలవ్యాధితో బాధపడేవారు, రక్తం పడుతున్నప్పుడు ఈ ఆకు కూరను తింటే మంచి ప్రయోజనం వుంటుంది. త్వరగా మూలవ్యాధి తగ్గుతుంది. అంతేకాదు ఈ ఆకు కాడల నుండి వచ్చే రసాన్ని కంఠానికి రాసినా, ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి సేవించినా కంఠ రోగాలు తగ్గిపోతాయి.