దాల్చిన చెక్కతో అధిక కొలెస్ట్రాల్ మాయం...

శుక్రవారం, 27 నవంబరు 2015 (16:45 IST)

మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు పట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క నూనె చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుందని, అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునేముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతుంటారు.
 
మాంసాహార, శాకాహార వంటకాల్లో సువాసన కోసం వాడే "దాల్చిన చెక్క" మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు.
 
కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు 3 పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు. బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావం బారి నుంచి కూడా కాపాడవచ్చు.
 
పది గ్రాముల దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే విపరీతమైన కడుపునొప్పితో బాధపడేవారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల దాల్చిన చెక్క పొడిని పావు లీటర్ వేడి నీటిలో రెండు గంటలపాటు ఉంచి ఆపై దాన్ని వడగట్టి సగ భాగం చొప్పున రోజుకు రెండుసార్లు సేవిస్తే నీళ్ల విరేచనాలను అరికట్టవచ్చు. మొటిమలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రాసుకుంటే తగ్గుముఖం పడతాయి.దీనిపై మరింత చదవండి :  
Cinnamon Elaichi Powder Health Tips

Loading comments ...

ఆరోగ్యం

news

అల్జైమర్స్‌ను నివారించాలంటే.. డ్రై ఫ్రూట్స్, బెర్రీ ఫ్రూట్స్ తీసుకోండి

అల్జైమర్స్‌ను నివారించాలంటే.. ముందుగా రెగ్యులర్ డైట్‌లో ప్రోటీనులు ఉండేలా చూసుకోవాలి. ఈ ...

news

రోజుకు రెండు కప్పుల గ్రీన్ మాత్రమే తాగాలి.. ఎందుకు?

రోజుకు ఆరేడు కప్పులు గ్రీన్ తాగేస్తున్నారా? బరువు తగ్గడం కోసం గ్రీన్ టీని ఎక్కువ ...

news

తీవ్రమైన పని ఒత్తిడి.. బాస్ ప్రేరేపిస్తున్నా మూడ్ రావడం లేదు ఎందుకని?

నా వయస్సు 32 యేళ్లు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. పిల్లలు, తన ...

news

కు.ని ఆపరేషన్‌కు వెళ్తే... వృషణం తీసేశారు.. రూ.2.5 కోట్ల నష్టపరిహారం

అమెరికాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (వెసక్టమీ) ...

Widgets Magazine