Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పరగడపున మెంతుల చూర్ణం తీసుకుంటే...?

సోమవారం, 26 జూన్ 2017 (14:44 IST)

Widgets Magazine

నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
 
* పసుపు : పసుపు శరీరానికి కావలసిన వేడి, రక్తశుద్ధి, కఫం, వాత, పిత్త రోగాలను నయం చేసే గుణం కలిగివుంది. అలాగే స్త్రీలు ఫేస్ ప్యాక్‌లా ఉపయోగిస్తారు. ఇందులో బేసిన్ పొడి కలుపుకుని ముఖానికి దట్టిస్తే ముఖారవిందం మరింతగా ఇనుమడింపజేస్తుంది. జలుబు, పొడి దగ్గు సమస్యలు తలెత్తినప్పుడు పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. దీంతో గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 
 
* అల్లం : అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తు ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది. 
 
* మెంతులు : మధుమేహ రోగులకు మెంతులు దివ్యౌషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరకడపున మెంతుల చూర్ణం లేదా మెంతులు నీళ్ళతో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులతోపాటు మధుమేహ వ్యాధి అదుపులో వుంటుంది. వీటితోపాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది.
 
* జీలకర : జీలకర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆహారం తినేందుకు మనస్కరించకపోవడం. అజీర్తిలాంటి వాటితో సతమతమౌతుంటే జిలకర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
* ఉసిరికాయ : ఉసిరికాయలో విటమిన్ సి అధిక మోతాదులోవుంటుంది. ఎండిపోయిన కాయలోను విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్ళ కాంతిని పెంపొందించే గుణం ఇందులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉసిరికాయను ప్రతి రోజు తీసుకోవడం వలన వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతాయి. వీలైతే ప్రతి రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఒక్క నిమ్మకాయ మీ అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తోంది...

ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు ...

news

కూల్‌డ్రింక్స్ కావు.. కిల్ డ్రింక్స్ : బాదంపాలు కూడా కల్తీనే...

మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌పై ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రస్తుతం ...

news

అల్పాహారాన్ని ఉదయం కాకుండా మధ్యాహ్నం తీసుకుంటున్నారా.. గుండెకు పోటే మరి..

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాల్సిన దోశ, ఇడ్లీ, పూరీ ఇలాంటి ఐటమ్స్ ను లంచ్, ...

news

మగ వైద్యలు.. లేడీ డాక్టర్లు ఎంత ఎంఎల్ మద్యం తీసుకోవాలి?

మగ డాక్టర్లు, ఆడ వైద్యులు ఎంత మోతాదులో మద్యం సేవించాలో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ...

Widgets Magazine