బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (09:32 IST)

లివర్ క్లీనింగ్‌కు బెస్ట్ డ్రింక్... ఎండు ద్రాక్ష రసం... ఎలా?

శరీరంలోని అంతర్గత అవయవాల్లో లివర్ అత్యంత కీలకమైన అవయవం. మనిషి తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించి... మిగిలిన విష పదార్థాలతో పాటు.. చెత్తను బయటకు పంపించి వేసే అత్యంత కీలకమైన అవయవం.

శరీరంలోని అంతర్గత అవయవాల్లో లివర్ అత్యంత కీలకమైన అవయవం. మనిషి తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించి... మిగిలిన విష పదార్థాలతో పాటు.. చెత్తను బయటకు పంపించి వేసే అత్యంత కీలకమైన అవయవం. ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అలాంటి లివర్‌కు అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకే సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా.. సిరోసిస్, హెపటీస్ ఏ, బి, సితో పాటు... అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. వీటితోపాటు.. అత్యంత ప్రమాదకరమైన ఫ్యాటీ లివర్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. దీనికి కారణం మారిన ఆహారపు అలవాట్లే. 
 
అలాంటి లివర్‌ను రక్షించుకునేందుకు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపడమే కాకుండా... ఇంటిపట్టునే ఉంటూ ఎండు ద్రాక్ష డ్రింక్ తీసుకుంటే చాలు. ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో పరిశీలిద్ధాం. ఒక కప్పు నాణ్యమైన ఎండు ద్రాక్షకు, మూడు కప్పుల నీటిని కలిపి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ నీటిని 24 గంటల పాటు నిల్వ ఉంచాలి. ఆ డ్రింక్‌ను వారం రోజుల పాటు తాగడం వల్ల లివర్ పూర్తిగా క్లీన్ అవుతుందని గృహవైద్య నిపుణులు చెపుతున్నారు. అయితే, ఈ డ్రింక్ తీసుకునే ముందు.. మద్యం అలవాటు ఉన్నవారు పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.