గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జులై 2016 (15:59 IST)

అల్లంతో వెంట్రుకలకు కలిగే ప్రయోజనాలేంటి?

అల్లం ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. ఆహార పదార్థాల తయారీలలో మసాలాగా వాడే అల్లం వికారం, హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించటమేకాకుండా, జుట్టుకు కూడా అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది.

అల్లం ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. ఆహార పదార్థాల తయారీలలో మసాలాగా వాడే అల్లం వికారం, హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించటమేకాకుండా, జుట్టుకు కూడా అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలను సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ఇది వెంట్రుకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా, వెంట్రుకలు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. 
 
తలపై చర్మం పొడిగా, పొలుసులుగా మారి నిరంతరంగా పెచ్చులుగా రాలటం వలన చాలా చికాకులకు గురవుతుంటాం. ఎందుకంటే, వివిధ రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడటం వలన ఇలా మారవచ్చు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. యాంటీ సెప్టిక్ లేదా క్రిమినాశక గుణాలను కలిగి ఉండే అల్లం రసంను ఉపయోగించవచ్చు. 
 
అల్లం రసం, 3 చెంచాల నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్, నిమ్మరసాలను కలపి, ఈ మిశ్రమాన్ని తలపై చర్మంపై మసాజ్ చేసి, 15 నుండి 30 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో కడిగి వేయండి. ఈ మిశ్రమాన్ని వారంలో 3 సార్లు రాసుకోవడం వల్ల ఫలితం కలిపిస్తుంది. అలాగే, వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది.