శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (19:20 IST)

జుట్టు రాలడాన్ని అరికట్టే అల్లం టీ...

ఈ రోజుల్లో చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అనే తాడే లేకుండా అందరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైన జుట్టు రావడం. ఇది కేవలం వాతావరణ కాలుష్యం వలన మాత్రమే రాదు. శారీరక, మానసిక సమస్యలు ఏర్పడితే కూడా జుట్టు రాలిపోతుంది. ప్రతి రోజూ అల్లం టీ క్రమం తప్పకుండా తాగితే మాడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 
 
కొందరి బుగ్గలు లోపలికి నొక్కుకుపోయి ఉంటాయి. అలాంటి వారు బుగ్గలు లావుగా అవ్వాలంటే ప్రతి రోజూ వెల్లుల్లిని నువ్వుల నూనెతో తీసుకుంటే చాలు. నెల రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖం మీద మొటిమలతో బాధపడే వారు రోజూ నిద్రపోయే ముందు టేబుల్ స్పూన్ నిమ్మరసంలో టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి రాసుకోవాలని. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.