గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (16:55 IST)

ఇలాచేస్తే జుట్టు (వెంట్రుకలు) రాలదు...

సాధారణంగా జుట్టు రాలిపోయే సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. ఇది వయసుతో సంబంధం లేదు. అయితే, ప్రకృతి సిద్ధమైన తులసి ఆకులతో దీనికి చెక్ పెట్టొచ్చు. తులసి ఆకులతో నూటికి నూరు శాతం జుట్టు రాలిపోయే సమస్యను అ

సాధారణంగా జుట్టు రాలిపోయే సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. ఇది వయసుతో సంబంధం లేదు. అయితే, ప్రకృతి సిద్ధమైన తులసి ఆకులతో దీనికి చెక్ పెట్టొచ్చు. తులసి ఆకులతో నూటికి నూరు శాతం జుట్టు రాలిపోయే సమస్యను అధికమించవచ్చని గృహవైద్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
ఎందుకంటే తులసి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు విటమ్ ఏ, సి, ఈ, కె లు ఉన్నాయి. వీటితో పాటు... శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి జట్టు రాలడాన్ని పూర్తిగా నివారించడమేకాకుండా కుదుళ్లను బలంగా మార్చుతాయి. అలాగే, చుండ్రును అరికడుతుంది. 
 
తులసి ఆకులను బాగా ఎండబెట్టి, శూర్ణంగా చేసుకోవాలి. తులసి ఆకుల పొడికి ఉసిరి పొడి, నీటిని కలిపి పేస్టులా తయారు చేసి రాత్రంతా నానబెట్టాలి. దీనికి ఆలివ్, రోజ్‌మేరీ ఆయిల్‌, బాదం నూనె కలపాలి ఆ మిశ్రమాన్ని కుదుళ్ళతో పాటు వెంట్రుకలకు బాగా పట్టించాలి. ఇలా ఓ గంటపాటు నెలకు రెండుసార్లు చేసినట్టయితే జుట్టు రాలిపోయే సమస్య నుంచి పూర్తిగా గట్టెక్కవచ్చు.