శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:11 IST)

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే చేమదుంపలు...

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో చేమదుంపలు ఒకటి. ఇవి రుచికోసమే కాకుండా పోషకాలు కూడా అందిస్తుంది. వేపుడే కాదు పులుసు కూర కూడా చేసుకోవచ్చు. అయితే, చేమ దుంపలు వారానికి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో చేమదుంపలు ఒకటి. ఇవి రుచికోసమే కాకుండా పోషకాలు కూడా అందిస్తుంది. వేపుడే కాదు పులుసు కూర కూడా చేసుకోవచ్చు. అయితే, చేమ దుంపలు వారానికి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని  న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు. 
 
ప్రధానంగా బరువు తగ్గాలనుకొనే వారు చేమ దుంపలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సలహా ఇస్తున్నారు. దీనికి కారణం కొవ్వు శాతం తక్కువగా ఉండటమే కాకుండా సోడియం శాతం కూడా తక్కువే.
 
ముఖ్యంగా ఇతర కూరగాయలతో పోల్చుకుంటే చేమ దుంపల్లో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. హృద్రోగాలు దరిచేరవు. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అన్నికంటే ముఖ్యంగా, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. 
 
ఇన్‌ఫెక్షన్లను దరి చేరనీయదు. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరంలో పీచు, యాంటిఆక్సిడెంట్లు మాదిరి పనిచేస్తాయి.