Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తక్కువ సమయంలో బరువు తగ్గాలంటే.. ఆ ఒక్కటీ చేస్తే చాలు

మంగళవారం, 16 మే 2017 (10:31 IST)

Widgets Magazine

అనేక మంది శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ముఖ్యంగా శారీరక వ్యాయామాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు ఉండదు. నిజానికి బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తే చాలు. 
 
పరుగు వల్ల శరీరంలో ఉండే అధిక కెలోరీలు కరిగిపోతాయి. దాంతో కొవ్వు కరగడం మొదలవుతుంది. అలా చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
 
కండరాలు దృఢంగా మారడంతో పాటూ, కాళ్లూ, శరీరం కూడా తీరైన ఆకృతిలోకి వస్తుంది. పరుగు వల్ల మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికి కంటే తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
 
పరుగెత్తడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే అందుకు కారణం. మనం తీసుకునే పోషకాలన్నీ శరీరంలోని అవయవాలన్నింటికీ సక్రమంగా అందుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి.
 
చిన్నగా పరుగెత్తడంతో పోలిస్తే వేగంగా పరుగెత్తడం వల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. పరుగు ప్రారంభించాలనుకునేవారు సరైన బూట్లను ధరించి పరుగెత్తడం మంచిది. అలాగే, దుస్తుల విషయంలోనూ సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మధుమేహం నియంత్రణలో ఆ ఏడు తప్పులను అధిగమించడం ఎలా?

మీరు మధుమేహాన్ని అదుపు చేసే పథకాన్ని ఈ మధ్యనే అమలులో పెట్టారా? లేక చాలా కాలం నుంచి స్వీయ ...

news

సజ్జ రొట్టెలు తినండి.. ఇలా బరువు తగ్గండి..

సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సజ్జల్లో విటమిన్లు, మినరల్స్ ప్రోటీన్లు ఎక్కువగా ...

news

వేసవిలో బార్లీ నీళ్లు తీసుకుంటే.. మేలేంటి?

వేసవిలో బార్లీ నీళ్లు సేవించడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బార్లీగింజల్ని ...

news

గ్రీన్ కాఫీ బీన్స్‌తో 2 నెలల్లోనే బరువు తగ్గొచ్చట.. నిజమేనా?

గ్రీన్ కాఫీ బీన్స్‌తో రెండు నెలల్లోనే బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ...

Widgets Magazine