బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : మంగళవారం, 30 డిశెంబరు 2014 (18:43 IST)

అజీర్ణపు కడుపునొప్పా...? ఉల్లి మేలు...!

పిల్లలైనా, పెద్దలైనా మోతాదుకు మించిన ఆహారం తీసుకుంటే అది జీర్ణం కాక కడుపునొప్పి ఏర్పడుతుంది. ఆ సమయంలో కడుపు ఉబ్బరంగాను, బాగా బరువెక్కినట్లు, గొంతులో పులిత్రేపులు రావడం జరుగుతుంది. 
 
వెంటనే కాసిన్ని వేడి నీళ్లు తాగి చూడండి. అప్పటికీ తగ్గకపోతే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కోసి ఉప్పు అద్దుకుని తినండి. అంతే కడుపునొప్పి మటుమాయమవుతుంది. 
 
చిన్న పిల్లలు అయితే శొంఠిని రంగరించి లేక పొడి చేసి నీటిలో కలిపి అర గంటకోసారి వంతున రెండు, మూడు సార్లు తాగించండి. కడుపునొప్పి తగ్గుతుంది.