శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : బుధవారం, 11 మార్చి 2015 (17:54 IST)

వెల్లుల్లి రసం రెండు చుక్కలు వేస్తే.. చెవిలో శబ్దం మటుమాయం..!

కొందరికి చెవిలో హోరు, ఏదో తెలియని శబ్దం వినిపిస్తుంటుంది. చెవి అంతర్గత భాగంలో ఇన్‌ఫెక్షన్ సోకడం, ఏదైనా చెవి సంబంధిత వ్యాధి ఏర్పడడం వలన ఈ విధంగా చెవిలో హోరు, శబ్దం వినిపిస్తుంటుంది. 
 
ఈ విధంగా శబ్దం వినిపిస్తున్నప్పుడు తల తిరగడం, శరీరం తూలడం, కడుపులో వికారం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ లక్షణాలను తెలుసుకుని, మందులను వాడాలి. లేకపోతే చెముడు వచ్చే అవకాశాలున్నాయి. 
 
ఈ విధంగా చెవిలో శబ్దం వినిపిస్తుంటే ప్రాధమికంగా మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే వైద్యం చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల రసం తీసుకుని ప్రతిపూట మూడు చుక్కలు వంతున చెవిలో వేస్తుంటే శబ్దం వినిపించదు. 
 
అదే విధంగా పండు జిల్లేడు ఆకులను బాగా వేడిచేసి, నలిపి పిండగా వచ్చే రసాన్ని మూడు చుక్కలు చొప్పున చెవిలో వేసినా కూడా నయమవుతుంది. ఇంకా బాదాంపప్పు నూనెను కొద్దిగా చెవిలో వేసి బయటకు కారకుండా దూది పెట్టాలి. 
 
నిర్గుండి తైలపు చుక్కలను ప్రతి పూట చెవిలో వేయాలి. సూర్యవర్తి, మాతులుంగ రసాలను కూడా వాడవచ్చును. ఇలా ప్రతి పూట చేస్తుంటే త్వరగా వ్యాధి నయమై చెవిలో శబ్దం వినిపించదు.