బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ttdj
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (13:54 IST)

ఉత్తరేణి ఆకు రసాన్ని ముక్కులో పోస్తే పాము విషం విరిగిపోతుందా?

ఉత్తరేణి ఆకురసాన్ని ముక్కులో పోసిన పాము విషం విరిగిపోతుంది. మూర్కొండాకు (పిప్పెంటాకు)లో వెల్లుల్లి మిరియాలు కలిపి నూరి ఆ రసాన్ని ముక్కులో పిండితే పాముకాటు విషాన్ని హరింపజేస్తుంది. వడ్రంగి చెట్టు కాయలు

ఉత్తరేణి ఆకురసాన్ని ముక్కులో పోసిన పాము విషం విరిగిపోతుంది. మూర్కొండాకు (పిప్పెంటాకు)లో వెల్లుల్లి మిరియాలు కలిపి నూరి ఆ రసాన్ని ముక్కులో పిండితే పాముకాటు విషాన్ని హరింపజేస్తుంది. వడ్రంగి చెట్టు కాయలు మృగశిర కార్తెలో తెచ్చి, వాని గంధం తీసి కడుపులోనికి త్రాగిస్తే ప్రాణ రక్షణ కలుగుతుంది.
 
దంతి వేర్ల చూర్ణాన్ని, నశ్యముగ పీలిస్తే పాము విషం దిగిపోతుంది. లేత ఆముదపు ఆకులు 1 తులం, నల్ల మిరియాలు 7 ఈ రెండింటిని మెత్తగా నూరి ఆ రసాన్ని పాము కాటుకు గురైన వ్యక్తితో తాగించాలి. కొద్ది సమయానికే వాంతులు వచ్చి కఫం బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మళ్ళీ ఇంకోసారి తాగించాలి. కొద్ది సమయానికే విష దోషం పోయి ఆరోగ్యవంతుడవుతాడు. అలా గంటలకు ఒకసారి తాగించాలి.
 
గొడ్డు బీర వేర్లు, మేక మూత్రంతో నూరి అందులో పుల్లకలిని (కుడి తిని) కలిపి చూర్ణం చేసి పీలిస్తే సర్పకాటు విషం హరిస్తుంది. 3-4 తులం నిమ్మ గింజలను నీళ్ళతో నూరి త్రాగిస్తే అన్ని రకాలైన పాముకాట్లు హరించి సర్ప ద్రష్టులుగా జీవిస్తారు.
 
మూడు మామిడి టెంకెలలోని జీడి పావు తులం, మిరియాలు పావు తులం, మామిడిపువ్వు, ఈ వస్తువులు మెత్తగా నూరి ఒక గ్లాసెడు నీళ్ళలో కలిపి తాగించాలి. 3 గంటల కొకసారి విషం విరుగునంత వరకు ఇవ్వాలి. ఇది అమృతంతో సమానం. పాము కాటుకు గురైన వారికి పావు కేజీ నెయ్యిని తాగించిన డోకు వచ్చి దాంతో పాటు విషం కూడా బయటకు వస్తుంది. దూసరి తీగ మొదలులో ఉండే దుంపను తెచ్చి నీటితో మెత్తగా నూరి పాము కరిచిన వారితో తాగించిన విషం విరిగిపోతుంది.