గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By IVR
Last Updated : శుక్రవారం, 4 జులై 2014 (20:39 IST)

పసుపు ఆరోగ్యానికి చేసే మేలు...

మన దైనందిన జీవితంలో వాడే పసుపు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పసుపు మన శరీరంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి పసుపు పెట్టుకుని స్నానం చేస్తే శరీర కాంతిని ఇనుమడింప జేస్తుంది.  అంతేకాదు చిన్నచిన్న చర్మ వ్యాధులనూ అరికడుతుంది.
 
తలలో వచ్చే కురుపులను గాయాలను మాన్పుతుంది. పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగితే కఫాన్ని అరికడుతుంది. పసుపు మంచి యాంటిబయాటిక్ గా పనిచేస్తుంది. కనుక వీలు ఉన్నప్పుడల్లా పసుపు వాడుతూ ఉండండి మరి.